Header Banner

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

  Wed Mar 12, 2025 19:21        Politics

ముంబై నటి కాదంబరీ జత్వాని కేసులో సస్పెండైన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు చంద్రబాబు సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్‍ను మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. 25, సెప్టెంబరు 2025 వరకూ వారి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రివ్యూ కమిటీ సిఫార్సుల అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్‍ను పొడిగించినట్లు విజయానంద్ తెలిపారు. కాగా, వైసీపీ హయాంలో ముంబై నటి జత్వానీపై వైసీపీ నేత విద్యాసాగర్ వేధింపులకు పాల్పడ్డాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆగమేఘాల మీద ముంబై వెళ్లి జత్వానీ కుటుంబాన్ని అరెస్టు చేశారు.


ఇది కూడా చదవండివర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!


అనంతరం ఓ వ్యాపారవేత్తపై కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు దిగి వేధించారు. దీంట్లో సదరు ముగ్గురు ఐపీఎస్‍ల పాత్రా ఉందంటూ పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి న్యాయం చేసేందుకు కూటమి సర్కార్ కేసును సీఐడీకి బదిలీ చేసింది. ఈ మేరకు వైసీపీ నేత విద్యాసాగర్, పీఎస్ఆర్ ఆంజనేయులు, సీపీ కాంతి రాణా టాటా, విశాల్ గున్నిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ముగ్గురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిందితుడు విద్యాసాగర్‍ను అరెస్టు చేయగా.. దాదాపు 76 రోజుల తర్వాత షరతులతో కూడిన బెయిల్‍పై విడుదల అయ్యాడు. మరోవైపు తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సదరు అధికారులు ఏపీ హైకోర్టును సైతం ఆశ్రయించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!

టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!


అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #kadhambhari #case #ips #suspend #todaynews #flashnews #latestnews